ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా ఇంత వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని సంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గణేష్ నాయక్ మండిపడ్డారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ సంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ప్రగతి భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ప్రగతిభవన్ ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు - tribals protest at pragathi bhavan
గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ప్రగతి భవన్ వద్ద ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి సమీప పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ప్రగతిభవన్ ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని.. రాచరిక పాలన నడుస్తుందన్నారు. ప్రభుత్వం హరితహారం పేరుతో గిరిజన రైతులు పోడు భూములపై జరుగుతున్న దాడులను ఆపివేయాలని వారు డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటైన తండా గ్రామ పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని కోరారు. తండాల అభివృద్ధి కోసం రూ.పది వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.