లంబాడి బస్తీకి చెందిన ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని... వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళలు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్, బాపు నగర్లోని లంబాడి బస్తీలో ఉన్న 400 వందల గజాల భూమి అన్యక్రాంతం అవుతుందని బస్తీవాసులు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా అదే ప్రాంతంలో తాము నివాసం ఉంటున్నామని... బస్తీలోని 400 గజాల భూమిలో తమ పిల్లల చదువు కోసం స్కూల్ నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు హామీని ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
'స్కూల్ నిర్మిస్తామన్నారు.. భూమినే కబ్జా చేస్తున్నారు' - తెలంగాణ వార్తలు
లంబాడి బస్తీలోని భూమిని కబ్జా చేస్తున్నారని గిరిజన మహిళలు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల కోసం స్కూల్ నిర్మిస్తామని చెప్పి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. హౌసింగ్ బోర్డు అధికారులతో కలిసి ఈ కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు
ఆ భూమిని కబ్జా చేసేందుకు పదేళ్లుగా యత్నిస్తున్నారని వాపోయారు. హౌసింగ్ బోర్డ్ ఆధీనంలో ఉన్న ఆ భూమిని స్థానికంగా ఉండే ఎం.రాజేష్ అనే వ్యక్తి అధికారులతో కలిసి స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:బర్త్డే మరునాడే పొట్టన పెట్టుకున్న కరోనా