తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధికి చిహ్నంగా రాష్ట్ర బడ్జెట్‌' - Hyderabad District News

రాష్ట్ర బడ్జెట్‌ గిరిజనుల ప్రగతికి, మహిళల అభ్యున్నతికి దోహదపడేలా ఉందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. గిరిజన గృహాల విద్యుత్ బిల్లుల రాయితీ కోసం రూ. 18కోట్లు కేటాయించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Tribal Women and Child Welfare Minister Satyavathi Rathore said the state budget was a symbol of development
'అభివృద్ధికి చిహ్నంగా రాష్ట్ర బడ్జెట్‌'

By

Published : Mar 19, 2021, 5:03 AM IST

రాష్ట్ర బడ్జెట్‌ అభివృద్ధికి చిహ్నంగా ఉందని గిరిజన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​ అభివృద్ధికి రూ. 250 కోట్ల నిధులు కేటాయించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో లేని విధంగా ఐటీడీఏలను మరింత పటిష్టం చేసేందుకు మొదటి సారి అసిస్టెన్స్ టు ఐటీడీఏ పద్దు పెట్టి... రూ. 25 కోట్లను కేటాయించినందుకు సీఎం కేసీఆర్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గిరిజన గృహాల విద్యుత్ బిల్లుల రాయితీ కోసం రూ. 18కోట్లు కేటాయించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలకు లబ్ది చేకూరేలా వడ్డీలేని రుణాల కోసం రూ. 3 వేల కోట్ల భారీమొత్తం ఇవ్వటం పట్ల సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:సకల జనుల హితంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌

ABOUT THE AUTHOR

...view details