రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 మంది సభ్యులతో ఏర్పాటైన సలహా మండలికి ఛైర్మన్‌గా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియామకమయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కేంద్ర ఎస్సీ, ఎస్టీ సంచాలకులు, రాష్ట్ర గిరిజన సాంస్కృతిక పరిశోధనా, శిక్షణా సంస్థ సంచాలకులు అధికార సభ్యులుగా కొనసాగనున్నారు. రాష్ట్రానికి చెందిన గిరిజన ఎంపీలు, ఆ శాఖ సంక్షేమ శాఖ కమిషనర్, ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ, 12 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు రాష్ట్ర గిరిజన సలహా మండలి కొనసాగనుంది.
నూతనంగా ఏర్పాటైన గిరిజన సలహా మండలి - గిరిజన మండలి
రాష్ట్రంలో నూతనంగా ఆదివాసీల సంక్షేమం కోసం గిరిజన మండలి ఏర్పాటైంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. మండలి ఛైర్మన్‌గా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించింది.
20 మంది సభ్యులతో ఏర్పాటైన గిరిజన సలహా మండలి