తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణి పోర్టల్‌పై తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లకు రేపు శిక్షణ - ధరణి తాజా అప్డేట్స్

ధరణి పోర్టల్​ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లకు మంగళవారం శిక్షణ ఇవ్వనున్నారు. సర్వర్​కు సంబంధించి తలెత్తుతోన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈనెల 29న ధరణి పోర్టల్​ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

trianing on dharani portal in telangana
ధరణి పోర్టల్‌పై తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లకు రేపు శిక్షణ

By

Published : Oct 26, 2020, 12:45 PM IST

ధరణి పోర్టల్‌పై తహసీల్దార్లకు, నయాబ్‌ తహసీల్దార్లకు మంగళవారం నాడు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే కొన్ని వివరాలు, సేవలతో పోర్టల్‌ సేవలు పాక్షికంగా అందుబాటులోకి వచ్చాయి. తహసీల్దార్లు ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తున్నారు. ధరణిలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు విడివిడిగా జరిపేలా ఏర్పాటు చేశారు. ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్‌ చేసుకోవడం, భూములు, ఎంకంబరెన్స్ వివరాలు, మార్కెట్ విలువ తెలుసుకోవడం లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.

పట్టాదారు పాసుపుస్తకం, సర్వే నంబర్లు, ఆస్తి పన్ను సంఖ్య ఆధారంగా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల సమాచారం తెలుసుకోవచ్చు. పోర్టల్‌ వాడకంలో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సర్వర్‌కు సంబంధించి తలెత్తుతోన్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ ప్రారంభానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ నెల 29న ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

ఇదీ చదవండి: ​ప్రారంభానికి సిద్ధమవుతోన్న ధరణి పోర్టల్​

ABOUT THE AUTHOR

...view details