తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad Drugs Case: కాల్​ డేటా ఆధారంగా టోనీ విచారణ.. రంగంలోకి ఈడీ? - hyderabad drugs case news

Hyderabad Drugs Case: మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు టోనీ కస్టడీ విచారణ ముగిసింది. గత నెల 29 నుంచి బుధవారం వరకు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు విచారించారు. ప్రధానంగా టోనీ కాల్‌డేటాపై దృష్టిసారించిన పోలీసులు.. అతనిచ్చిన సమాచారంతో పరారీలో ఉన్న మరో ఆరుగురిని అరెస్టు చేశారు. ఇందులో టోనీ ప్రధాన అనుచరుడు ఇమ్రాన్‌ బాబు షేక్‌ భార్య ఫిర్‌దోస్‌ ఉంది.

drugs
drugs

By

Published : Feb 3, 2022, 6:02 AM IST

Updated : Feb 3, 2022, 2:01 PM IST

Hyderabad Drugs Case: మెట్రో నగరాల్లో ఏజెంట్లను నియమించుకొని.. వ్యాపారులే లక్ష్యంగా మాదకద్రవ్యాల దందా కొనసాగించిన టోనీని పోలీసులు లోతుగా విచారించారు. అతని వద్ద లభించిన ఫోన్​ వాట్సాప్​లో మెసెజ్​లు డిలీట్​ చేసి ఉండడంతో.. వాటిని తిరిగి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో అతని కాల్‌డేటా ఆధారంగా విచారించారు.

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులతో తరచూ టచ్‌లో ఉన్న టోనీ... వేడుకలకు వారు అడిగినంత మాదక ద్రవ్యాలను సరఫరా చేసినట్లుగా గుర్తించారు. ఇందుకు కోడ్‌ భాషలను వాడి కొరియర్‌ బాయ్‌ల ద్వారా సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. కొన్ని మత్తు పదార్థాలను ఓయో హోటల్‌ గదుల్లో బసచేస్తూ సరఫరా చేసినట్లు బయటపడింది.

టోనీ కాల్​ డేటా ఆధారంగా పరారీలో ఉన్న మరో ఆరుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిని పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో డీసీపీ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌, పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు నార్కోటిక్‌ కంట్రోల్ సెల్‌ ఏసీపీ నర్సింగ్‌రావు పీఎస్​కు వచ్చి టోనీ వాంగ్మూలం నమోదు చేశారు. ఐదు రోజుల పాటు టోనీని విచారించిన పోలీసులు... ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. మరింత లోతుగా కేసును విచారించేందుకు టోనీని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది.

హైదరాబాద్​ నుంచే కాకుండా పలు నగరాలకు చెందిన వ్యాపారవేత్తలు మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి టోనీ అనుచరుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు తేలింది. హవాలా రూపంలో ఈ నగదును నైజీరియాకు చెందిన స్టార్​ బాయ్‌కి చేరవేసినట్లు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై ఈడీ కేసునమోదుచేసే అవకాశం ఉంది. ఈ కేసులో టోనీతో పాటు అరెస్టయిన ఏడుగురు వ్యాపారవేత్తలు, ఇద్దరు ఆఫీస్​బాయ్‌లకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఇదీచూడండి:

Last Updated : Feb 3, 2022, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details