సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ కేసులో విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని బీపీ ఆచార్య కోరారు. తదుపరి విచారణ నాటికి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలుకు జగన్ సమయం కోరారు. డిశ్ఛార్జ్ పిటిషన్ల దాఖలుకు ఎంపీ విజయసాయిరెడ్డి, కార్మెల్ ఏషియా కంపెనీ కూడా సమయం కోరారు. జగన్, విజయసాయిరెడ్డి వినతితో ఏకీభవించిన న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది.
JAGAN CASES: జగతి పబ్లికేషన్స్, వాన్‌పిక్ ఛార్జ్షీట్లపై విచారణ గురువారానికి వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో విచారణ
సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ కేసులో విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని బీపీ ఆచార్య కోరారు. తదుపరి విచారణ నాటికి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలుకు జగన్ సమయం కోరారు.
JAGAN CASES
రఘురాం సిమెంట్స్ కేసులో వాదనలకు వి.డి రాజగోపాల్ సమయం కోరారు. ఈ ఛార్జ్‌షీట్ పై విచారణను జూలై 1 కి కోర్టు వాయిదా వేసింది. పెన్నా సిమెంట్స్ కేసు అభియోగాల నమోదుపై జగతి పబ్లికేషన్స్ వాదనలు వినిపించింది. వాదనల కొనసాగింపు కోసం విచారణ రేపటికి వాయిదా వేసింది. జగతి పబ్లికేషన్స్, వాన్‌పిక్ ఛార్జ్షీట్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.
ఇదీ చూడండి:Lucky stone: జ్యోతిష్కుడి మ్యాజిక్కు.. దొంగలే కాదు పోలీసులూ అవాక్కు..!