దసరా పర్వదినం ముగియటంతో తిరుగు ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ కిటకిటలాడుతున్నాయి. కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకునేందుకు వెళ్ళిన వారు హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. బుధవారం తిరుగు ప్రయాణంలో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కొందరు ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడం, ఉన్న బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉండటం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల పాట్లు - Travelers' conditions on the retreat hyderbad
ఐదురోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సహజంగా తిరగాల్సిన సంఖ్యలో బస్సులు నడపకపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల అవస్థలు