అమెరికాకు చెందిన ప్రొఫెసర్ ఫిలిప్ వాగ్నేర్ రచించిన ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ పుస్తకాన్ని హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని చారిత్రక అవశేషాల్ని గుర్తించేందుకు పరిశోధకులకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ పుస్తకావిష్కరణ - ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ పుస్తకాన్ని హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు.
రాష్ట్రంలో ఎంతో చారిత్రక సంపద దాగి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అమెరికా ప్రొఫెసర్ వాగ్నేర్ రచించిన ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ అనే పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ పుస్తకావిష్కరణ
రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకుసీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు.అందులో భాగంగానే యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను అభినందించారు.
ఇదీ చూడండి : తెలుగు విశ్వవిద్యాలయంలో పాటల పండుగ సత్కారం