Travel Agency Cheating in Hyderabad : రాష్ట్రంలో రోజుకో ఛీటింగ్ కేసు (Cheating Case) వెలుగులోకి వస్తోంది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. రిజిస్టర్ కాని కొన్ని చిన్నచిన్న ఫైనాన్స్ కంపెనీలు, ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు యాథేచ్ఛగా బాధితుల నుంచి రూ. లక్షల్లో దోచుకొని ఒక్కసారిగా బోర్డు తిప్పేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థుల నుంచి లక్షల్లో డబ్బులు వసూళ్లు చేసి ఓ ట్రావెల్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు.
railwayjobs cheating in adilabad : రైల్వే ఉద్యోగాల పేరిట బురిడీ.. మహిళ అరెస్ట్
CTS Travel Agency Cheat :బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో సీటీఎస్ కార్పొరేట్ సొల్యూషన్ (CTS Corporate Solution)అనే ట్రావెల్ ఏజెన్సీ విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసింది. అబిడ్స్‌లోని ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్‌లో సీటీఎస్ కార్పొరేట్ సొల్యూషన్ పేరుతో గత కొంతకాలంగా ట్రావెల్ ఏజెన్సీ నడుస్తోంది. అమెరికా, యూకె, కెనడా, స్విట్జర్లాండ్ దేశాలకు ఫ్లైట్ టికెట్స్ బుక్చేస్తానని 40 మంది బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. డబ్బులు చేతికి వచ్చిన తరువాత.. ఏజెంట్ కుతుబుద్ధీన్ పరారయ్యాడు.
CTS Corporate Solution Travel Agency Cheating : దీంతో విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు అయోమయంలో పడ్డారు. దీనిపై సుమారు 40 బాధితులు ట్రావెల్ ఏజెంట్‌పై అబిడ్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నిందితుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సీటీఎస్ కార్పొరేట్ ట్రావెల్ ఏజెన్సీపై గతంలోనూ పలుచీటింగ్ కేసులు నమోదయ్యాయి. ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుడు కుతుబుద్ధీన్పై అబిడ్స్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.