తెలంగాణ

telangana

ETV Bharat / state

'భవిష్యత్‌లో కరెంట్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు...' - cmd prabhakar rao

వచ్చే ఏడాదిలోపు యాదాద్రి పవర్‌ప్లాంటు రెండు యూనిట్లను కమిషన్ చేసి, మరో యూనిట్‌ను సింక్రనైజ్ చేసేలా పనుల్లో వేగం పెంచాలని ట్రాన్స్‌కో జెన్క్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. పవర్ ప్లాంట్ పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు.

Trasco jenco cmd prabhakar rao review on power stations with bhel officials
పనుల్లో వేగం పెంచడి.. బీహెచ్‌ఈఎల్ అధికారులకు జెన్కో సీఎండీ ఆదేశం

By

Published : May 7, 2022, 8:26 PM IST

వచ్చే ఏడాదిలోపు రెండు యూనిట్లను కమిషన్ చేసి... మరో యూనిట్‌ను సింక్రనైజ్ పనుల్లో వేగం పెంచాలని బీహెచ్‌ఈఎల్ అధికారులను ట్రాన్స్‌కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఆదేశించారు. భవిష్యత్‌లో కరెంట్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు.. సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను వేగవంతం చేయాలని కోరినట్లు ప్రభాకర్ రావు తెలిపారు. దానికి బీహెచ్ఈఎల్ అధికారులు అందరూ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. వచ్చే సంవత్సరంలోపు యాదాద్రి పవర్ ప్లాంట్‌లోని ఐదు యూనిట్లలో రెండు యూనిట్లు అంటే 800 మెగావాట్స్ కమిషన్ చేయాలని స్పష్టం చేశామన్నారు. దానికితోడు మరో యూనిట్‌ను సింక్రనైజ్ చేయాలని చెప్పామని వెల్లడించారు.

వచ్చే రెండేళ్లలో మిగతా వాటిని కూడా అనుసంధానం చేయాలని చెప్పామని పేర్కొన్నారు. ఇవాళ జరిగిన బీహెచ్ఈఎల్‌, టీఎస్‌జెన్కో మీటింగ్ నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. కరోనా వలన పనులు కొంత ఆలస్యం అయ్యాయని తెలిపారు. రానున్న రోజుల్లో పనులు వేగవంతం చేస్తామని బీహెచ్ఈఎల్ డైరెక్టర్ హామీనిచ్చారు. అనుకున్న సమయానికి మొదటి యూనిట్‌ను అనుసంధానం చేస్తామని.. అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కేటీపీఎస్‌లో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details