తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆవుపై దాడి చేసింది చిరుతే...

రాజేంద్రనగర్‌లో చిరుత ఆచూకీ కోసం అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆనవాళ్లు నమోదైతే బోన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తామని వెల్లడించారు. నిన్న ఆవుపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో కెమెరాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

trap-cameras-arrange-for-leopard-at-rajendra-nagar
ఆవుపై దాడి చేసింది చిరుతే... అప్రమత్తమైన అధికారులు

By

Published : Feb 16, 2021, 12:53 PM IST

రాజేంద్రనగర్​ ఫాతీమా ఫామ్​ హౌజ్​ పశువుల కొట్టంలో... అటవీ అధికారులు 20 ట్రాప్​ కెమెరాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఆవుపై దాడిచేసింది చిరుతేనని నిర్ధరణ చేశారు.

దాని ఆచూకీ కోసం కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చిరుత ఆనవాళ్లు నమోదైతే మూడు బోన్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం

ABOUT THE AUTHOR

...view details