తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రవాణా శాఖ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకు సేవలు అందించ గలుగుతున్నామని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఎం వ్యాలెట్ ద్వారా అందుతున్న సేవలను పరిశీలించారు. కార్యాలయానికి వచ్చిన వినియోగదారులను అడిగి అక్కడి సేవలపై ఆరా తీశారు. త్వరలో హైదరాబాద్‌లో మొత్తం 5 జోన్లలో పర్యటించి పరిస్థితులపై సమీక్షిస్తానని మంత్రి తెలిపారు.
'దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు ఆర్టీఏ సేవలు' - రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
రవాణా శాఖ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థ లేకుండా... ప్రజలకు మెరుగైన సేవలు అందిచగలుగుతున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలపై కార్యాలయానికి వచ్చిన వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు.
!['దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు ఆర్టీఏ సేవలు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4380148-thumbnail-3x2-mingupta.jpg)
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శన
'దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు ఆర్టీఏ సేవలు'
ఇదీ చూడండి : "మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాట తప్పారు"