తెలంగాణ

telangana

ETV Bharat / state

Puvvada Ajay: ఆర్టీసీకి రోజూ 9 కోట్ల ఆదాయం... మరింత పెంచుకుంటే..!

హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని రవాణా శాఖ కార్యాలయంలో శాఖ ముఖ్య అధికారులతో టీఎస్ఆర్టీసీ ఆర్థికాంశాలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. సంస్థకు వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చు, అప్పుల వివరాలపై సమావేశంలో చర్చించారు.

Transport minister
ఆర్టీసీ

By

Published : Aug 22, 2021, 10:39 PM IST

టీఎస్ఆర్టీసీ(Tsrtc)కి ప్రస్తుతం ప్రతి రోజూ రూ.9 కోట్ల ఆదాయం సమకూరుతోందని... మరో రూ.2 నుంచి రూ.3 కోట్ల ఆదాయం పెంచుకోగలితే సంస్థ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Transport Minister Puvvada Ajay Kumar) పేర్కొన్నారు. హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని రవాణా శాఖ కార్యాలయంలో శాఖ ముఖ్య అధికారులతో టీఎస్ఆర్టీసీ ఆర్థికాంశాలపై సమీక్ష నిర్వహించారు.

సంస్థకు వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చు, అప్పుల వివరాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో సంస్థకు రూ.1,500 కోట్లు, అదనంగా మరో రూ.1,500 కోట్లు బ‌డ్జెటేత‌ర‌ నిధులను కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. బడ్జెట్​లో కేటాయించిన నిధుల్ని ప్రభుత్వం సంస్థకు నెలనెలా సమకూరుస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

బ‌డ్జెటేత‌ర‌ నిధుల కింద తొలి విడతగా ప్రభుత్వ గ్యారెంటీతో రూ.1,000 కోట్లు బ్యాంకు రుణంగా మంజూరు చేస్తోందని.. ఇందులో రూ.500 కోట్లు వచ్చాయని, మ‌రో రూ.500 కోట్లు త్వర‌లో వ‌స్తాయని చెప్పారు. ఈ నిధుల్ని సంస్థ ఆవసరాల కోసం ఎలా వినియోగించాలనే విషయంపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

సీసీఎస్ బకాయిలు చెల్లిస్తాం...

సంస్థ ఆర్థికావసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులను కేటాయించడంతో పాటు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం కూడా వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఇవే కాకుండా ఎన్​సీడీసీ బ్యాంకు ద్యారా ప్రభుత్వ పూచికత్తుతో మరో రూ.500 కోట్లను లోన్ తీసుకుని సీసీఎస్ బకాయిలు చెల్లించాలని నిర్ణయం సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. సంస్థ అభ్యున్నతి కోసం ఉద్యోగులు, అధికారులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

ఇదీ చూడండి:Rains in Telangana: రాష్ట్రంలో రాగల మూడ్రోజులు.. మోస్తరు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details