తెలంగాణ

telangana

ETV Bharat / state

'వేగాన్ని నియంత్రించినప్పుడే ప్రమాదాలు నివారించగలం' - తెలంగాణ రహదారి భద్రతా మాసోత్సవాలు

ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో రహదారి భద్రతా మాసోత్సవాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వేగాన్ని నియంత్రించుకుంటూ ప్రయాణాలు చేసినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని మంత్రి పేర్కొన్నారు.

puvvada ajay kumar
puvvada ajay kumar

By

Published : Jan 19, 2021, 2:09 PM IST

రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్‌బెల్ట్‌, హెల్మెట్ ధరించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలలో భాగంగా ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

వేగాన్ని నియంత్రించుకుంటూ ప్రయాణాలు చేసినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని మంత్రి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు రవాణా శాఖ తమ వంతు కృషిచేయాలన్నారు. భద్రత ఉత్సవాల సందర్భంగా మహిళల బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు భద్రత బ్యానర్, స్టిక్కర్, రోడ్డు నిబంధనల కరపత్రాలను విడుదల చేశారు. రోడ్డు భద్రత అనేది ప్రతిక్షణం అవసరమని నిర్లక్ష్యం తగదని మంత్రి వివరించారు.

ఇదీ చదవండి :కాళేశ్వరంలో కేసీఆర్... గోదారి జలాలతో అభిషేకం

ABOUT THE AUTHOR

...view details