తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు ఆర్టీసీ నూతన సూపర్‌ లగ్జరీ బస్సుల ప్రారంభం - తెలంగాణ రవాణా శాఖ తాాజా వార్తలు

TSRTC buying new buses: టీఎస్​ఆర్టీసీలో కొత్త బస్సులు వస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతో కూడిన సరికొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌.. ఇవాళ  సుమారు 50 బస్సులను ప్రారంభించనున్నారు.

TSRTC buying new buses
TSRTC buying new buses

By

Published : Dec 24, 2022, 9:43 AM IST

టీఎస్‌ఆర్టీసీలో కొత్తగా 1016 బస్సులు.. తొలి విడతలో 50 బస్సులు నేడే ప్రారంభం

TSRTC buying new buses: ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు టీఎస్​ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 392 కోట్ల వ్యయంతో అధునాతనమైన వెయ్యి 16 బస్సులను కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. 630 సూపర్‌ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులను కొనుగోలుకు యాజమాన్యం టెండర్లను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించి అన్ని బస్సులు వచ్చే మార్చి నాటికి ఆర్​టీసీ చేతికి అందనున్నాయి.

తొలి విడతగా రాష్ట్రానికి వచ్చిన 50 బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రారభించనున్నారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త సూపర్‌ లగ్జరీ బస్సుల్లో సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్యానిక్‌ (panic) బటన్ సదుపాయం కల్పించారు. ఇబ్బందులు ఎదురైతే ఈ బటన్‌ను నొక్కగానే ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుంది.

అధికారులు స్పందించి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుంటారు. ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్​ఈడీ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ కెమెరాలతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంది. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం ఏర్పాటు చేశారు. బస్సులో ఉష్ణోగ్రత పెరిగినా అలారం మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్​డీఏఎస్​ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details