హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ట్రాన్స్జెండర్లపై వేధింపులకు పాల్పడిన కుర్మా వెంకట్‌కు శిక్షపడేలా చేసినందుకు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పీఎస్‌కు వెళ్లి ఏసీపీ సుదర్శన్, సీఐ కళింగరావులను ట్రాన్స్జెండర్లు ఘనంగా సత్కరించారు.
బంజారాహిల్స్ పోలీసులను సన్మానించిన ట్రాన్స్జెండర్లు - పోలీసులను సన్మానించిన ట్రాన్స్జెండర్లు
ట్రాన్స్జెండర్లను వేధింపులకు గురి చేసిన కుర్మా వెంకట్‌కు శిక్షపడేలా చేసినందుకు బంజారాహిల్స్ పోలీసు అధికారులను ఘనంగా సన్మానించారు. పీఎస్‌కు వెళ్లి ఏసీపీ, సీఐలను సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
బంజారాహిల్స్ పోలీసులను సన్మానించిన ట్రాన్స్జెండర్లు
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కుర్మా వెంకట్, అతని ముఠా నిత్యం తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, న్యాయస్థానంలో శిక్షపడేలా సాక్ష్యాధారాలను నివేదించారు. విచారణలో న్యాయస్థానం ఇటీవలే నిందితునికి శిక్ష విధించింది.