హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 69 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు వ్యవహారం తర్వాత భారీగా బదిలీలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాగుట్ట ఎస్‌హెచ్‌వో బదిలీ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు - transfers of inspectors
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరిగాయి. 69 మంది సీఐలను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
10రోజుల క్రితం సీసీఎస్‌కు బదిలీ అయిన హరిచంద్రారెడ్డిని తిరిగి పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోగా నియమించారు. ప్రస్తుతం పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోగా ఉన్న నిరంజన్‌రెడ్డిని సీసీఎస్‌కు బదిలీ చేశారు. నారాయణగూడ ఎస్‌హెచ్‌వోగా రాపోలు శ్రీనివాస్‌రెడ్డి, సైఫాబాద్ కె.సత్తయ్య, బేగంబజార్ ఎన్.శంకర్, శాలిబండ జి.కిషన్, మొగల్పుర శివకుమార్, ఆసిఫ్‌నగర్ శ్రీనివాస్, హబీబ్‌నగర్ శ్రీరామ్ సైదాబాబు, రాంగోపాల్‌పేట ఎస్‌హెచ్‌వోగా జి.లింగేశ్వరరావు నియమిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి: