రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు - 15 IAS officers postings in telangana
19:16 January 31
రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు
తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్‌గా భారతి హోళికేరి, నిజామాబాద్ కలెక్టర్‌గా రాజీవ్ గాంధీ హనుమంతు, హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్, వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ (హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు), కుమురంభీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా యాస్మిన్ బాషా, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా జి.రవి, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా ఎస్.వెంకటరావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎస్.హరీశ్ ను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక నవంబరులో కూడా తెలంగాణ ప్రభుత్వం 14 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అందులో జోగులాంబ గద్వాల జిల్లాకు అపూర్వ చౌహాన్, వరంగల్‌కు అశ్విని తానాజీ, మంచిర్యాల జిల్లాకు బి.రాహుల్, నారాయణపేటకు మయాంక్ మిట్టల్, జగిత్యాలకు మందా మకరందు, జనగామకు ప్రఫుల్ దేశాయ్, మేడ్చల్ జిల్లాకు అభిషేక్ అగస్త్య, నల్గొండ జిల్లాకు కుష్బూ గుప్తా, వికారాబాద్‌కు రాహుల్ శర్మ నియమితులయ్యారు.
ఇవీ చూడండి:
TAGGED:
15 IAS officers postings