Transfer of Government Employees: తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సమ్మతించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన ఉత్తరంపై తగు నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1369 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఉద్యోగులను ఏపీకి పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం లేదని ధృవీకరణ ఇచ్చి పంపించిన పిదప.. ఏపీ ప్రభుత్వం వారు 1369 మందిని తీసుకొనుటకు అంగీకారాన్ని తెలియజేయాల్సిందిగా ఆయన కోరారు. అదే విధంగా తెలంగాణకు చెందిన 1808 ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నారని.. వారు తెలంగాణకు రావడానికి దరఖాస్తు చేసుకున్నారని నారాయణ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వారికి ఎన్‌ఓసీ ఇచ్చి సంబంధిత పత్రాన్ని తెలంగాణకు పంపిందని తెలిపారు.