తెలంగాణ

telangana

ETV Bharat / state

తితిదే జేఈవో బసంత్‌కుమార్‌ బదిలీ.! - ap news

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సంయుక్త కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి బసంత్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. ఆయనను తదుపరి పోస్టింగ్‌ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల పరిశీలకుడిగా మాత్రం ఆయన సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ttd jeo, basanth kumar
తితిదే జేఈవో, బసంత్​కుమార్​

By

Published : Feb 5, 2021, 12:19 PM IST

బసంత్‌కుమార్​ను ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయనను కలెక్టర్‌గా నియమించేందుకు సుముఖంగా లేని ప్రభుత్వం... వేరే అధికారుల పేర్లతో ఎస్‌ఈసీకి మరో ప్యానల్‌ను పంపించింది.

బసంత్‌కుమార్‌కు బదులు వివేక్‌ యాదవ్‌ను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఇటీవలే ఎస్​ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బసంత్‌కుమార్‌ను తితిదే జేఈవో స్థానం నుంచి బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి:కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

ABOUT THE AUTHOR

...view details