TELANGANA: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఎంత మంది అంటే? - తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ
17:44 April 28
రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
IAS Transfers In Telangana: రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఐఏఎస్ అధికారి కె. అశోక్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మంత్రి హరీశ్ రావు ఓఎస్డీగా ఉన్న ఆయనను ఐ అండ్ పీఆర్‌కు బదిలీ చేశారు. ఇప్పటి వరకు అదనపు బాధ్యతల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. అశోక్ రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న బి.గోపికి సీసీఎల్ఏ కార్యదర్శిగా పోస్టింగు ఇచ్చిన ప్రభుత్వం.. వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను సీసీఎల్‌ఏలో ప్రత్యేకాధికారిగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు సీసీఎల్ఏ కార్యదర్శిగా ఉన్న హైమావతి, సీసీఎల్ఏలో ప్రత్యేకాధికారిగా ఉన్న సత్య శారదను తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇవీ చదవండి: