TRANSCO Uses Modern Technology to control substations :విద్యుత్ సరఫరా ప్రక్రియలో టీఎస్ ట్రాన్స్-కో నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆటోమేషన్ పరిజ్ఞానంతో సబ్ స్టేషన్ల ఆపరేషన్ ప్రక్రియను నిర్వహిస్తుంది. మణికొండలో ఒక ఎకరం స్థలంలో ఔట్ డోర్ జీఎస్ సబ్ స్టేషన్‌ను ట్రాన్స్-కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సుమారు రూ.60 కోట్ల వ్యయంతో 132/33కేవీ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ సబ్ స్టేషన్‌కు సుమారు 2.4 కిలోమీటర్ల మేర భూగర్భకేబుళ్లను ఏర్పాటు చేశారు. ఔట్ డోర్ సబ్ స్టేషన్ కావడంతో తక్కువ ఖర్చుతోనిర్మాణం జరిగినట్లు ట్రాన్స్-కో అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తొలి ఔట్ డోర్ జీఎస్ సబ్ స్టేషన్‌ను మణికొండలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్‌లో అన్ని కూడా ఔట్ డోర్ సబ్ స్టేషన్ల నిర్మాణం చేయనున్నట్లు ట్రాన్స్ చెబుతుంది.
TS TRANSCO Introduced New Technology In Manikonda :మణికొండ సబ్ స్టేషన్‌ను ఆటోమేషన్ పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల్లోని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పన్నమయ్యే కరెంట్.. ట్రాన్స్-కో ఆధ్వర్యంలో తొలుత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 400, 220 కేవీ సబ్ స్టేషన్లకు సరఫరా అవుతుంది. సబ్ స్టేషన్లలో ఆ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సిబ్బంది ఉంటారు. కానీ.. ఈ నూతన సాంకేతికతతో అక్కడున్న సిబ్బందితో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌ద్వారా ఆటోమేషన్ టెక్నాలజీతో నిర్వహిస్తున్నారు. దీనివల్ల కరెంట్ సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తగ్గడంతో పాటు మానవ, ఆర్థిక వననరులు ఆదా అవుతున్నాయని ట్రాన్స్-కో శాఖ వెల్లడించింది. ఈ సబ్ స్టేషన్లో షిఫ్ట్‌లో కేవలం ఒక్కరు మాత్రమే అది కూడా అత్యవసర నిమిత్తం ఉంటారని.. ఏమైనా మ్యానువల్ సమస్యలు వస్తే.. సదరు సిబ్బంది పనిచేస్తారని అధికారులు పేర్కొంటున్నారు.