జనతా కర్ఫ్యూ అత్యవసర సేవలో భాగంగా విధులు నిర్వహించిన విద్యుత్ శాఖ సిబ్బందికి ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అభినందనలు తెలిపారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యల్లో భాగంగా విద్యుత్ అధికారులు, సిబ్బంది విధుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ప్రభాకరరావు పేర్కొన్నారు. అత్యవసర సేవల్లో పాలుపంచుకున్న ప్రతి విద్యుత్ ఉద్యోగికి ఆయన అభినందనలు తెలిపారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా.. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
విద్యుత్ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు: సీఎండీ ప్రభాకరరావు - రాష్ట్రంలో కరోనా వైరస్
జనతా కర్ఫ్యూలో విధులు నిర్వర్తించిన విద్యుత్ ఉద్యోగులకు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు అభినందనలు తెలిపారు.
ప్రతి విద్యుత్ ఉద్యోగికి అభినందనలు: సీఎండీ ప్రభాకరరావు