దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ 3025 పోస్టుల భర్తీకి 3 వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది. జూనియర్ లైన్ మెన్ పోస్టులు 2500, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 500, జూనియర్ పర్సనల్ అధికారి 25 పోస్టులకు ప్రకటనలు జారీ చేసింది.
వయోపరిమితిని పెంచండి...
గతంలో ఈ పోస్టులకు వయో పరిమితి 44 ఏళ్ళుండగా తాజా ప్రకటనల్లో తగ్గించింది. జేఎల్‌కు 35, మిగతా రెండు రకాల పోస్టులకు 34 ఏళ్ళలోపు వారే దరఖాస్తు చేయాలని పేర్కొంది. ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో... అర్టిజన్ పేరుతో తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగుల్లో వారు చేరే తేదీ నాటికి ఎంత వయసుందో.. దాని ప్రకారం పరిగణనలోకి తీసుకుంటారు. వారికి ప్రస్తుతం ప్రకటించిన 35 ఏళ్ళ పరిమితి వర్తించదు. పబ్లిక్ సర్వీసు కమీషన్ భర్తీ చేస్తున్న పోస్టులకు దరఖాస్తుదారులు 44 ఏళ్ళ వయో పరిమితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు కూడా వయో పరిమితి పెంచాలని నిరుద్యోగులు కొరుతున్నారు.
జేఎల్ పోస్టులకు ఈనెల 31 నుంచి నవంబర్20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 22న రాతపరీక్ష ఉంటుంది. మిగిలిన రెండు రకాల పోస్టులకు... ఈ నెల 22 నుంచి వచ్చేనెల10 లోగా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 15న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష