తెలంగాణ

telangana

ETV Bharat / state

'అగ్నిపథ్​' ఎఫెక్ట్​.. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ నుంచి నేడు రైళ్లు బంద్​!

Agnipath Protest in Secunderabad: 'అగ్నిపథ్' నిరసనలతో రణరంగంలా మారిన సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ నుంచి ఇవాళ రైళ్ల రాకపోకలు ఉండవని సమాచారం. స్టేషన్​లో పాడైన రైల్వే సామగ్రి మరమ్మతులకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

'అగ్నిపథ్​' ఎఫెక్ట్​.. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ నుంచి నేడు రైళ్లు బంద్​!
'అగ్నిపథ్​' ఎఫెక్ట్​.. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ నుంచి నేడు రైళ్లు బంద్​!

By

Published : Jun 17, 2022, 4:27 PM IST

Updated : Jun 17, 2022, 4:36 PM IST

Agnipath Protest in Secunderabad: 'అగ్నిపథ్​' ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. నిరసనకారుల బీభత్సానికి స్టేషన్‌లోని కీలక వస్తువులు ధ్వంసమయ్యాయి. రైల్వే పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రయాణికుల వస్తువులనూ ధ్వంసం చేసిన ఆందోళనకారులు.. గూడ్స్‌ రైళ్ల నుంచి ద్విచక్ర వాహనాలను కిందకు దింపి తగులబెట్టారు. పలు ఎలక్ట్రిక్ పరికరాలనూ ధ్వంసం చేశారు.

సికింద్రాబాద్‌ ఆందోళనకారుల ఘటనలో... మూడు రైళ్లు దెబ్బతిన్నాయని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేశ్‌ తెలిపారు. ఉదయం 9 గంటలకే ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌లోకి వచ్చారన్న CPRO.... ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా తరలించామని చెప్పారు. పాడైన రైల్వే సామగ్రి మరమ్మతులకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ సికింద్రాబాద్ నుంచి రైళ్ల రాకపోకలు ఉండవని సమాచారం. ఈ అల్లర్లతో ఇప్పటికే 72 రైళ్లను రద్దు చేయగా.. 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మూడింటిని దారి మళ్లించారు.

సంబంధిత కథనాలు..

Last Updated : Jun 17, 2022, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details