Delay in South Central Trains : దక్షిణ మధ్య రైళ్ల ఆలస్యం కారణంగా ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక అవస్థలు పడుతున్నారు. సమయపాలనలో రైల్వే దక్షిణ భారతానికి 11వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన ఓ ఘటన దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
South Central Trains Delay : ఇటీవల మహారాష్ట్ర నుంచి ఖమ్మం వరకు రైల్లో ప్రయాణిస్తున్న అయిదుగురు ప్రయాణికులు నిజామాబాద్‌లోని మిత్రుడికి ఫోన్ చేశారు. రైల్లో తినడానికి మంచి ఆహారం దొరకడం లేదని, రైలు నిజామాబాద్‌కి రాత్రి 8 గంటలకు వస్తుందని ఆ సమయానికి మంచి భోజనం తీసుకురమ్మని చెప్పారు. మిత్రుడు వారు చెప్పినట్టు భోజనం తీసుకుని రాత్రి 7.40 గంటలకి నిజమాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ ట్రైన్ నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది. అర్ధరాత్రి 12 గంటలకు తర్వాత కూడా నిజమాబాద్ స్టేషన్‌కు చేరుకోలేదు. రైలు ఆలస్యం వల్ల వారంతా ఆకలితో స్టేషన్ చేరుకునే వరకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.
సమయపాలనలో ఎన్నో స్థానం తెలుసా: రైల్వేశాఖ అంతర్గత నివేదిక (2022-2023) ప్రకారం దేశంలోని 19 జోన్లలో దక్షిణ మధ్యరైల్వే జోన్ సమయపాలనలో 11వ స్థానంలో ఉంది. సగటు రోజుకు నూరు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, దాని ఫలితంగా ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికులు సకాలంలో గమ్యం చేరుకోలేక పోతున్నారని అంచనా. కార్యాలయాలకు, ఇతర ముఖ్యమైన పనులకు హాజరు కావడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మధ్యలో ఆలస్యం.. చివర్లో స్పీడు..రైళ్లు మార్గం మధ్యలో ఆగే స్టేషన్లకు బాగా ఆలస్యంగా చేరుకుంటున్నాయి. ఈ ఆలస్యాన్ని కొంతైనా సర్దుబాటుచేయడానికి చివరలో ట్రైన్ స్పీడు పెంచుతున్నారు.