తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: దక్షిణ మధ్య రైల్వేలో 23 రైళ్లు పాక్షిక రద్దు

కరోనా నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ పరిధిలోని 23 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రద్దు చేసిన రైళ్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని పేర్కొంది.

trains cancelled in south central railway
దక్షిణ మధ్య రైల్వేలో రైళ్లు రద్దు

By

Published : May 1, 2021, 3:00 PM IST

కరోనా ప్రభావం రైళ్లపై తీవ్రంగా పడింది. గత కొద్ది రోజులుగా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో నిత్యం పదుల సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తక్కువ మంది ప్రయాణించే రూట్లలో ఉండే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

హెచ్.ఎస్.నాందేడ్- తాండూర్, తాండూర్- హెచ్.ఎస్.నాందేడ్​కు వెళ్లే రైళ్లను ఈ నెల 2 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఔరంగాబాద్- హెచ్.ఎస్.నాందేడ్​కు వెళ్లే రైలు 10 నుంచి 31 వరకు, హెచ్.ఎస్.నాందేడ్- ఔరంగాబాద్ వెళ్లే రైలు 7 నుంచి 28 వరకు రద్దు కానున్నాయి. ఆదిలాబాద్- హెచ్.ఎస్.నాందేడ్, వికారాబాద్- గుంటూరు 2 నుంచి 31 వరకు. రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

సికింద్రాబాద్- యశ్వంత్ పూర్, తిరుపతి- మన్నార్ గుడికి ఈ నెల 2 నుంచి 30 వరకు, మన్నార్ గుడి- తిరుపతికి ఈ నెల 3 నుంచి 31 వరకు, రేపల్లె- కాచిగూడకు ఈనెల 3 నుంచి జూన్​1 వరకు రద్దు కానున్నాయి. కాచిగూడ- రేపల్లె, గుంటూరు- కాచిగూడకు 2 నుంచి 31వ తేదీ వరకు, సికింద్రాబాద్-సాయినగర్ శిరిడీ ఈ నెల 2 నుంచి 30 వరకు, సాయినగర్ శిరిడీ- సికింద్రాబాద్ 3వ తేదీ నుంచి 31 వరకు రైళ్లను రద్దు చేస్తున్నుట్లు రైల్వేశాఖ తెలిపింది.

తిరుపతి- చెన్నై సెంట్రల్​, చెన్నై సెంట్రల్- తిరుపతి వరకు 2వ తేదీ నుంచి 31 వరకు, సికింద్రాబాద్- విశాఖపట్టణం 3వ తేదీ నుంచి 31 వరకు, విశాఖపట్టణం- సికింద్రాబాద్ ఈ నెల 4 నుంచి జూన్​ 1 వరకు రద్దు కానున్నాయి. ఔరంగాబాద్- రేణిగుంట ఈనెల 7 నుంచి 28 వరకు, రేణిగుంట- ఔరంగాబాద్ ఈ నెల 8 నుంచి 29 వరకు. పర్బనీ-హెచ్.ఎస్ నాందేడ్ 4వ తేదీ నుంచి జూన్​ 2 వరకు రైళ్లను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

ఇదీ చదవండి:కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details