తెలంగాణ

telangana

ETV Bharat / state

జూనియర్​ కళాశాలల అధ్యాపకులకు ఆన్​లైన్​ బోధనపై శిక్షణ - తెలంగాణ తాజా వార్తలు

ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులకు ఆన్​లైన్ బోధనలో నైపుణ్యం కల్పించేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా డిజిటల్ దిశ కార్యక్రమాన్ని.. ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్‌ ప్రారంభించారు.

on online teaching for government junior college faculty
జూనియర్​ కళాశాలల అధ్యాపకులకు ఆన్​లైన్​ బోధనపై శిక్షణ

By

Published : Jul 15, 2020, 11:46 AM IST

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులకు ఆన్​లైన్ బోధనపై శిక్షణ ఉంటుందని ఇంటర్​ విద్య కమిషనర్​ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,300 మంది అధ్యాపకులకు... కాగ్నిజెంట్, అడోబ్ సిస్టమ్స్, నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్టు జలీల్ పేర్కొన్నారు.

వివిధ సాఫ్ట్​వేర్లు, గ్రాఫిక్స్, అసైన్ మెంట్లను ఉపయోగించి ఆన్​లైన్ బోధనకు అవసరమైన మెటీరియల్ ఏవిధంగా రూపొందించాలి... వాటిని విద్యార్థులకు ఏవిధంగా బోధించాలి అనే అంశంపై శిక్షణ ఇస్తామన్నారు. అధ్యాపకులను బ్యాచ్‌లుగా విభజించి.. ఒక్కో బ్యాచ్‌కి రెండు రోజులపాటు శిక్షణ ఇస్తారు. అధ్యాపకులకు అప్పగించిన ప్రాజెక్టులు పూర్తి చేసి.. 12వ రోజున సమర్పించాల్సి ఉంటుంది. వాటిని సమీక్షించిన తర్వాత.. బ్యాచ్‌ల వారీగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తారు.

ఇదీ చూడండి:జూరాల గేట్లు ఎత్తిన అధికారులు... శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

ABOUT THE AUTHOR

...view details