ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ, మారుత్ డ్రోన్ (Drone) టెక్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ పరస్పర ఒప్పందం ద్వారా గ్రామీణ యువత, రైతులకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇవ్వడానికి అవకాశం కలుగనుంది. ఇప్పటికే డ్రోన్ల (Drone)ను ప్రయోగాత్మకంగా వినియోగించేందుకు విశ్వవిద్యాలయానికి డీజీసీఏ అనుమతి ఇచ్చింది.
నాణ్యతా ప్రమాణాలతో కూడిన శిక్షణ విధానాలు రూపొందించుకోవాల్సిందిగా యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు సూచించారు. డ్రోన్ (Drone) టెక్నాలజీ వినియోగంలో కనీస పరిజ్ఞానం లభించేలా శిక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. గ్రామీణ వ్యవసాయదారులు సత్వరం అందిపుచ్చుకొనేలా శిక్షణ ఉండాలని అన్నారు.