Trainee IPS Parade in Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీ.. 175 మంది ఐపీఎస్‌ల దీక్షాంత్ సమారోహ్‌కు వేదిక కానుంది. దేశానికి చెందిన 155 మందితో పాటు.. 20 ఫారెన్ ట్రైనీ ఆఫీసర్‌లు వీళ్లతో కలిసి శిక్షణ పొందారు. 155 మంది ఐపీఎస్‌లలో 123 మంది పురుషులు, 32 మంది మహిళలున్నారు. వేరే ఉద్యోగాలు చేస్తూ ఐపీఎస్ సాధించిన వాళ్లు 91 మంది ఉండగా.. నేరుగా ఐపీఎస్ సాధించిన వాళ్లు 64మంది ఉన్నారు. ఎక్కువగా ఇంజనీరింగ్ విద్య నుంచి వచ్చిన వాళ్లే ఈ బ్యాచ్ లో ఉన్నారు.
కానిస్టేబుల్స్ టు IPS.. ఇద్దరు వీరవనితల విజయ ప్రస్థానం
Dikshant Samaroh in Hyderabad :102 మంది ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన వాళ్లుండగా.. ఆ తర్వాత ఆర్ట్స్ నుంచి వచ్చిన వాళ్లు 17, సైన్స్ 12మంది, కామర్స్ 10, వైద్య విద్య పూర్తి చేసి ఐపీఎస్‌లుగా ఎంపికైనా వాళ్లు 9మంది ఉన్నారు. న్యాయ విద్య నుంచి వచ్చిన వాళ్లు కేవలం ముగ్గురున్నారు. 75వ బ్యాచ్ లో తెలంగాణ నుంచి 5గురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురున్నారు. తెలంగాణ నుంచి ఎంపికై తెలంగాణకు కేటాయించిన వాళ్లలో నలుగురు ఐపీఎస్ లున్నారు. గత బ్యాచ్ తో పోలిస్తే ఈ ఏడాది కొత్త అంశాలనూ శిక్షణలో చేర్చారు
Amit Shah inDikshant Samaroh in Hyderabad :శిక్షణలో భాగంగా పలు రకాల సబ్జెక్ట్‌లను బోధించారు. ఎన్డీపీఎస్ చట్టంతో పాటు..పెరుగుతున్న సైబర్ నేరాలను నిరోధించే విధంగా శిక్షణ ఇచ్చారు. 11 నెలల పాటు మొదటి దశ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అంతర్గత భద్రత, శాంతి భద్రతలు, దర్యాప్తు, సమాచార సాంకేతికత, దృక్పథం, విలువలు, మానవ హక్కులు, నేరాలు వంటి అంశాలపై ఐపీఎస్ శిక్షణార్థులు తర్ఫీదు పొందారు. దేహదారుడ్యం, ఈత, డ్రైవింగ్, యోగ, తుపాకులు కాల్చడంలోనూ శిక్షణ పూర్తి చేశారు.