తెలంగాణ

telangana

ETV Bharat / state

వేగంగా వస్తున్న రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య - train death

జీవితం చాలా విలువైనది. కానీ కొందరు చిన్న చిన్న సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటున్నారు. వాటిని ఎదుర్కోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఓ వ్యక్తికి ఏం కష్టం వచ్చిందో ఏమో... రైలు కింద పడి బలవన్మరణం చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని కూకట్​పల్లి పరిధిలో చోటుచేసుకుంది.

వేగంగా వస్తున్న రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

By

Published : Apr 9, 2019, 2:01 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి పరిధిలో విషాదం చోటుచేసుకుంది. హైటెక్​సిటీ రైల్వేస్టేషన్​లో ఓ వ్యక్తి... వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అతని వద్ద రైల్వే పాస్​ను పరిశీలించగా... మృతుడు ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన సైదులుగా తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంబంధిత వ్యక్తులు వస్తే... పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని రైల్వేపోలీసులు... శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

వేగంగా వస్తున్న రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

ఇదీ చూడండి: రజనీకి విలన్​గా 'ఖుషీ' దర్శకుడు

For All Latest Updates

TAGGED:

train death

ABOUT THE AUTHOR

...view details