తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం మత్తులో రైలు కింద నుంచి వెళ్లాలనుకున్నాడు.. కానీ!! - train accident

మామూలుగానే రైళ్లను ఎక్కేందుకు ఆ పట్టాల మీది నుంచి.. ఈ పట్టాలకీ నడిచి వెళ్తుంటారు. మన కోసం ఒక వంతెన ఉందన్న ఆలోచనే ఉండదూ. మరీ మద్యం మత్తులో ఉన్నవారి గురించి అయితే చెప్పనవసరం లేదు. అందుకే ఆ యువకుడు రైలు కోసం పట్టాలు దాటబోయి కాలు పోగొట్టుకున్నాడు.

train-accident-at-guthi-railway-junction-in-ananthapuram

By

Published : Jul 31, 2019, 3:46 PM IST

మద్యం మత్తులో ఒక యువకుడు గూడ్స్ కింద పడి కాలు పోగొట్టుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జoక్షన్​లో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన కుమార్ అనే యువకుడు హిందూపురం వెళ్లే పాసింజర్ రైలు కోసం ఎదురు చూస్తుండగా గుంతకల్లు నుండి గుత్తికి రైలు వచ్చింది. అయితే అనుకున్న ప్లాట్​ఫాంలోకి రాకుండా మరొక ప్లాట్​పామ్​లోకి రైలు వచ్చి ఆగడంతో... రైలెక్కాలనే ఆతృతతో ఒకటవ ప్లాట్​ఫాం నుండి మరో ప్లాట్​ఫాంలోకి వెళ్లడానికి వంతెన నుండి కాకుండా పట్టాల నుండి వెళ్లే ప్రయత్నం చేసాడు. అప్పటికే.. అక్కడి పట్టాలపై నిలిచి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా... ప్రమాదవశాత్తు గూడ్స్ కదలడంతో చక్రాల కింద పడిన కుమార్ కాలు చిక్కుకొని నుజ్జునుజ్జయిపోయింది. అతను మద్యం సేవించడం వల్లే గూడ్స్​ను దాటలేక... ప్రమాదానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. వెంటనే క్షతగాత్రుడిని చికిత్స కోసం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరరలించగా... పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కింద నుంచి వెళ్లాలనుకున్నాడు..

ABOUT THE AUTHOR

...view details