తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎండల్లో కూడా చల్లగా ఉండు గురూ... - ENDALU

ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో కూర్చుంటేనే వేడికి తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నాం. మరి భానుడి ఉగ్రరూపానికి తట్టుకుని, ట్రాఫిక్​ రద్దీ, చెవులు పగిలిపోయే హారన్ చప్పుళ్ల మధ్య విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఏంటి.. వారి ఆరోగ్యం కోసమే ఉన్నతాధికారులు స్పెషల్ కిట్ రూపొందించారు.

ఎండల్లో కూడా చల్లగా ఉండు గురూ...

By

Published : May 31, 2019, 5:47 PM IST

Updated : May 31, 2019, 6:16 PM IST

ఎండల్లో కూడా చల్లగా ఉండు గురూ...

గ్రేటర్‌లో రహదారులపై నిత్యం వాహనాల రద్దీ... దీనికి తోడు మండుతున్న ఎండలు... ఏసీ కారులో కూర్చున్నా ఒళ్లంతా చెమటలే. అలాంటిది నడిరోడ్డుపై నిల్చొని ట్రాఫిక్​ను కంట్రోల్ చేస్తూ మన కోసం కష్టపడతారు ట్రాఫిక్ పోలీసులు. మరి వారు ఆరోగ్యంగా ఉండి మరిన్ని సేవలందించాలని ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు బాగు కోరుకుంటూ చేస్తున్న అధికారుల చర్యలు తమకు సంతృప్తినిస్తున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ట్రాఫిక్ సిబ్బంది.

ఎండ వేడి తట్టుకునేలా..

ఎండల బారిన పడి రుగ్మతలకు గురి కాకుండా రహదారులపై విధులు నిర్వర్తించే సిబ్బందికి చలువ అద్దాలు, మాస్క్‌, తాగునీరు, మజ్జిగ, గ్లూకోజ్‌ నీళ్లు వంటివి అందిస్తున్నారు. అలాగే సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

సిబ్బందిలో ఆనందం..

ఉన్నతాధికారులు చేపడుతున్న చర్యల పట్ల మండుటెండల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరోగ్యం గురించి అధికారులు ఆలోచించడం ట్రాఫిక్ సిబ్బందికి కొత్త ఉత్సాహాన్ని కల్గిస్తోంది.

ఇవీ చూడండి: బధిర బాలుడైనా... బహు కళాకోవిదుడు

Last Updated : May 31, 2019, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details