తెలంగాణ

telangana

ETV Bharat / state

రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌ చేస్తే ఇకపై భారీ జరిమానా..!

ఇకపై ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. బైక్​పై ముగ్గురు ప్రయాణించినా, వ్యతిరేక దిశలో డ్రైవ్ చేసినా భారీ జరిమానా విధిస్తామని ప్రకటించారు. నియమాలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Hyderabad Traffic Police
Hyderabad Traffic Police

By

Published : Nov 20, 2022, 7:40 AM IST

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు మరింత కఠినతరం చేయనున్నారు. వ్యతిరేక దిశలో డ్రైవింగ్‌ చేసినా, ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణించినా జరిమానా విధిస్తామని ప్రకటించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే రూ.1,700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1,200 జరిమానా విధించనున్నారు. ఈ నెల 28 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నియమాలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ పాటించడం ద్వారా ప్రాణనష్టం నిరోధించవచ్చని సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లు, ఆపరేషన్ రోప్ వంటివి కేవలం ట్రాఫిక్ నియంత్రణ, వాహనదారుల భద్రతే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత మూడేళ్లుగా వ్యతిరేక దిశ, ట్రిపుల్ డ్రైవింగ్‌ చేసి దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details