Traffic restrictions in Guntur: ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్లీనరీ దృష్ట్యా ఈనెల రేపు, ఎల్లుండి 16వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తెలిపారు. ప్లీనరీ జరిగే మార్గంలో జాతీయ రహదారిపైకి ఇతర వాహనాలు రాకుండా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి దారిమళ్లిస్తారు. చీరాల- బాపట్ల – రేపల్లె- అవనిగడ్డ- పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా వాహనాలు వెళ్లాల్సి ఉంటుందన్నారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు బుడంపాడు మీదుగా.. తెనాలి, కొల్లూరు, పెనుమూడి వారధి, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్ జంక్షన్ మీదుగా మల్లించారు.
విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ నుంచే దారి మళ్లించి గుడివాడ మీదుగా.. అవనిగడ్డ, రేపల్లె, చీరాల మీదుగా ఒంగోలు వెళ్లేలా చర్యలు చేపట్టారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు మీదుగా.. ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనములు ఇబ్రహీంపట్నం వద్ద దారి మళ్లించుకుని హనుమాన్ జంక్షన్ వైపు వెళ్లాలని సూచించారు.