తెలంగాణ

telangana

ETV Bharat / state

Charminar Traffic Restrictions: చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే! - Ek Shyam Charminar Ke Nam program

హైదరాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు (Charminar Traffic Restrictions) విధించనున్నారు. ఈ ఆంక్షలు రేపు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ (Hyderabad Cp Anjani Kumar) వివరించారు.

Charminar
చార్మినార్

By

Published : Oct 16, 2021, 5:10 PM IST

'ఏక్‌ శ్యామ్‌ చార్మినార్‌ కే నామ్‌' (Ek Shyam Charminar Ke Nam) పేరిట నిర్వహించనున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ చార్మినార్‌ పరిసరాల ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు (Charminar Traffic Restrictions) విధించనున్నట్లు సీపీ అంజనీకుమార్‌ (Hyderabad Cp Anjani Kumar) తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఈ ఆదివారం నుంచి 'ఏక్‌ శ్యామ్‌ చార్మినార్‌ కే నామ్‌' (Ek Shyam Charminar Ke Nam) పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

దారుల మళ్లింపు...

ఇందుకోసం అఫ్జల్​గంజ్, మదీనా నుంచి వచ్చే వాహనాలను... గుల్జార్ హౌజ్ నుంచి మెట్టికాషేర్, కాలికమాన్, ఎతేబార్ చౌక్ వైపు మళ్లించానున్నారు. ఫలక్​నుమా, హిమ్మత్ పురా నుంచి వచ్చే వాహనాలు... పంచమొహళ్ల నుంచి షా ఫంక్షన్ హా, మొఘల్ పురా ఫైర్ స్టేషన్ రోడ్, బీబీ బజార్ వైపు మళ్లించనున్నారు.

బీబీబజార్, మొఘల్ పురా వాటర్ ట్యాంకు, హఫీజ్ దంకా మసీదు నుంచి వచ్చే వాహనాలు... సర్దార్ మహల్ వద్ద కోట్ల అలీజా, ఎతేబార్ చౌక్ వైపు మళ్లించనున్నారు. మూసాబౌలీ, ముర్గీచౌక్, ఘాన్సీ బజార్ నుంచి వచ్చే వాహనాలను లాడ్ బజార్, మోతీ గల్లి వద్ద ఖిల్వత్ రోడ్ వైపు మళ్లించనున్నారు. అఫ్జల్ గంజ్, నయాపూల్, మదీనా వైపు నుంచి వచ్చే వారికి సర్దార్ మహల్ జీహెచ్ఎంసీ కార్యాలయం, కోట్ల అలీజా బాయ్స్ హైస్కూల్, మదీనా ఎస్​వైజే కాంప్లెక్స్, చార్మినార్ ఏయూ ఆసుపత్రి, చార్మినార్ బస్ టెర్మినల్ ఇన్​గేట్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఉత్తమం...

ముర్గీచౌక్, షాలిబండ వైపు నుంచి వచ్చే వారికి మోతీగల్లి పెన్షన్ ఆఫీస్, ఉర్దూ మస్కాన్ ఆడిటోరియం, ఖిల్వత్ గ్రౌండ్, చార్మినార్ ఏయూ ఆసుపత్రి, చార్మినార్ బస్ టర్మినల్ ఇన్​గేట్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మదీనా, పురానాపూల్, గోషామహల్ వైపు నుంచి వచ్చే వారికి కులీకుతుబ్ షా స్టేడియం, సీటీ కళాశాల, ఎంజే బ్రిడ్జ్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ప్రయాణికులు, సాధారణ ప్రజలు చార్మినార్ మార్గం బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సీపీ అంజనీకుమార్‌ సూచించారు.

ఇదీ చదవండి: 'రామోజీ ఫిలింసిటీ.. హైదరాబాద్​లో ఉండటం గర్వకారణం'

ABOUT THE AUTHOR

...view details