తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నగరంలో నేడు ట్రాఫిక్​ ఆంక్షలు - Traffic Restrictions in Hyderabad Today

Traffic Restrictions in Hyderabad Today: సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నగరంలో నేడు ట్రాఫిక్​ ఆంక్షలు
ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నగరంలో నేడు ట్రాఫిక్​ ఆంక్షలు

By

Published : Oct 3, 2022, 9:47 AM IST

Traffic Restrictions in Hyderabad Today: రాష్ట్రంలో నేటితో బతుకమ్మ సంబురాలు ముగియనున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు.. చివరిరోజైన నేడు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. వేడుకల కోసం ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో కన్నుల పండువగా వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు కానున్నాయి. నిజాం కాలేజ్‌, బషీర్‌బాగ్ కూడలి వైపు, ఆర్‌బీఐ, లక్డీకపూల్, తెలుగుతల్లి కూడలి వైపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

వేడుకల కోసం ఎల్బీ స్టేడియానికి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వీఐపీలు, అధికారుల కోసం టెన్నిస్ మైదానంలో పార్కింగ్ ఏర్పాట్లు చేసిన అధికారులు.. మీడియా వాహనాలకు ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయం వద్ద పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. నిజాం కాలేజ్‌ మైదానంలోనూ పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details