Traffic Restrictions in Hyderabad Today : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేడు హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో.. ఎమార్పీఎస్ నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు ఉంటాయని నగర అదనపు (ట్రాఫిక్) పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు వెల్లడించారు.
కార్తికమాసం స్పెషల్ - శైవ క్షేత్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు
- బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్ వరకు.. టివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్ల మధ్య రహదారులను మూసివేయనున్నారు.
- సికింద్రాబాద్ సంగీత్ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే వాహనాలను.. వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, సీటీఓ, సీటీఓ, బేగంపేట రసూల్‌పురా వైపు మళ్లించనున్నారు.
- బేగంపేట నుంచి సంగీత్ కూడలికి వచ్చే ట్రాఫిక్‌ను.. సీటీఓ ఎక్స్ రోడ్స్ వద్ద బాలంరాయ్, టివోలి, స్వీకార్ ఉప్‌కార్, బ్రూక్‌బాండ్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్ల వైపు పంపిచనున్నారు.
- తాడ్‌బండ్ , బోయిన్‌పల్లి నుంచి టివోలి వైపు వచ్చే వాహనాలను బ్రూక్ బాండ్ వద్ద సీటీఓ, ట్యాంక్‌బండ్, రాణిగంజ్ వైపు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.
- ఏబీఎస్, కార్ఖానా నుంచి ప్యాట్నీ-ఎస్‌బీహెచ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను.. స్వీకార్-ఉప్‌కార్ వద్ద వైఎంసీఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ లేదా బ్రూక్‌బాండ్-టివోలి, సీటీవో, బాలంరాయ్ వైపు మళ్లాలని పేర్కొన్నారు.
- ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలను.. ఎస్‌బీహెచ్- స్వీకార్-ఉప్‌కార్ వైపు అనుమతిలేదని చెప్పారు. వైఎంసీఏ, క్లాక్ టవర్ లేదా సీటీఓ, ప్యారడైజ్ వైపు పంపించనున్నారు.
- ఆర్టీఏ కార్యాలయం (తిరుమలగిరి), సఫిల్‌గూడ, కార్ఖానా, మల్కాజిగిరి నుంచి ప్లాజా వైపు వచ్చే వాహనాలను.. టివోలి వద్ద స్వీకార్-ఉప్‌కార్, వైఎంసీఏ లేదా బ్రూక్ బాండ్, బాలంరాయ్, సీటీఓ వైపు ప్రయాణించాలని పేర్కొన్నారు.
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి బేగంపేటవైపు వచ్చే ట్రాఫిక్‌ను.. పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్ రాజ్‌భవన్ వైపు పంపించనున్నారు.
PM MODI Schedule Today : సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో.. ఎమార్పీఎస్ నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్ర మోదీపాల్గొననున్నారు. సాయంత్రం 4:45 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని.. 5:00 గంటలకు పరేడ్ మైదానంలో జరిగే సభకు చేరుకుంటారు. 5:45 గంటలకు వరకు అక్కడ ఉండనున్నారు. సభ అనంతరం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.