తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగారు.. దొరికారు.. - పోలీసుల డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు

మద్యం సేవించి వాహనం నడపరాదని ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లో నిర్వహించిన తనిఖీల్లో తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు.

కార్లు స్వాధీనం

By

Published : Feb 23, 2019, 6:29 AM IST

Updated : Feb 23, 2019, 7:48 AM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్​లో ట్రాఫిక్​ పోలీసులు అర్ధరాత్రి డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి ఉన్న ఓ వాహనదారుడు హల్​​చల్​ చేశాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ.. కారు నుంచి దిగనని భీష్మించుకు కూర్చున్నాడు. చివరకు ఖాకీలు కారు చుట్టూ బారికేడ్లను కట్టడి చేసి అతనిని కిందకు దించారు.

200 దాటిన ఆల్కహాల్ శాతం

కారు యజమాని రెండు వందల శాతం మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో మొత్తం పది కార్లను స్వాధీనం చేసుకున్నట్లు బంజారాహిల్స్​ ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ బి. ప్రసాదరావు పేర్కొన్నారు.

ట్రాఫిక్​ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపి ఇతరులకు ఇబ్బందులు కల్గించవద్దని సూచించారు.

ట్రాఫిక్​ పోలీసుల డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు

ఇవీ చదవండి:మదమెక్కిన డ్రైవర్​..

Last Updated : Feb 23, 2019, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details