హైదరాబాద్‌లో వాహన శబ్ధ కాలుష్యంపై పోలీసులు దృష్టిసారించారు. అమీర్‌పేట, మైత్రీవనం సర్కిల్ ప్రాంతాల్లో బస్సుల హారన్ సౌండ్‌ను తనిఖీ నిర్వహించారు. శబ్ధం ఎక్కువగా వచ్చే మల్టీ హారన్స్ ఉపయోగించే వాహనాలపై కేసు నమోదు చేసి జరిమాన విధించి వెంటనే హారన్లను తొలగించారు. రాత్రి అయిందంటే ప్రైవేటు బస్సుల శబ్ధ కాలుష్యంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మల్టీహారన్స్తో ప్రయాణికులు, రోడ్లపై వెళ్లే ఇతర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పోలీసులు తెలిపారు.
వాహనాల శబ్ధ కాలుష్యంపై ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు - హైదరాబాద్
హైదరాబాద్‌లోని అమీర్‌పేట, మైత్రీవనం సర్కిల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు... బస్సుల హారన్ సౌండ్‌ను తనిఖీ చేశారు. మల్టీ హారన్స్ ఉపయోగించే వాహనాలపై కేసు నమోదు చేసి జరిమాన విధించారు.
ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు