తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు

లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు మోటార్​ వాహనాల చట్టం కింద 12,939 కేసులు నమోదు చేశారు. 1,842 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Traffic_Police_Cases_On_Violaters
లాక్​డౌన్​ ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు

By

Published : Apr 13, 2020, 5:57 AM IST

లాక్​డౌన్​ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఆదివారం వరకు భారీగా కేసులు నమోదు చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మోటార్​ వాహనాల చట్టం కింద 12,939 కేసులు నమోదుకాగా 1,842 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్​డౌన్​ ఉల్లంఘించిన మరో 2,962 వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

లాక్​డౌన్​ ఉల్లంఘనలకు పాల్పడిన కేసులను పరిశీలిస్తే... ఎలాంటి పత్రాలు లేని 911 మంది వాహనదారులపై కేసులు నమోదు చేయగా... డబుల్​రైడింగ్​ చేసిన 1,391 ద్విచక్రవాహనాలపై కేసులు పెట్టారు. సింగిల్​ రైడింగ్​ చేస్తూ ఉల్లంఘించిన 660 వాహనదారులపైనా కేసులు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:కేసీఆర్​ చెప్పిన 'హెలికాప్టర్‌ మనీ'కి అర్థమేంటి?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details