తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించేందుకు పోలీసుల ప్రణాళిక - Traffic police latest news

Hyderabad Traffic Police: హైదరాబాద్​లో వాహనదారులు.. పాదచారులు రహదారులపై సాఫీగా ప్రయాణించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. పైవంతెనల కింద వాహనాలు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు. ఐటీ కారిడార్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్‌జామ్​లు అవుతుండటంతో ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి కేంద్రీకరించారు.

హైదరాబాద్​
హైదరాబాద్​

By

Published : Aug 11, 2022, 7:28 AM IST

Hyderabad Traffic Police: హైదరాబాద్​లో వాహనదారులు.. పాదచారులు రహదారులపై సాఫీగా ప్రయాణించేందుకు.. స్రాధ్యమైనంత వేగంగా గమ్యస్థానాలు చేరుకునేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న పైవంతెనల వద్ద ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ఐటీ కారిడార్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్‌జాంలు అవుతుండడంతో దృష్టి కేంద్రీకరించారు.

షేక్‌పేట పైవంతెన.. మాదాపూర్‌ తీగల వంతెనతోపాటు కొత్తగా అందుబాటులోకి రానున్న ఐకియా, గబ్చిబౌలి పైవంతెనల కింద వాహనాలు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఒక్కోవైపు మూడు వరుసలున్న(లేన్స్‌) పైవంతెనల నుంచి వేగంగా వస్తున్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోతుండడంతో ట్రాఫిక్‌ పోలీసులు శ్రమపడి నియంత్రిస్తున్నారు.

తీగల వంతెన దిగేశాక:గచ్చిబౌలి, మాదాపూర్‌ నుంచి తీగల వంతెన మీదుగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, బంజారాహిల్స్‌కు వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. కేబుల్‌ వంతెన ప్రారంభమైన దగ్గర నుంచి ఫ్లైఓవర్‌ దిగేంత వరకు సాఫీగా వచ్చినా.. రోడ్‌ నం.45 వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడంతో వందల సంఖ్యలో వాహనాలు ఆగిపోతున్నాయి. సాయంత్రం వేళల్లో ఒక్కోసారి రెండు, మూడుసార్లు రెడ్‌లైట్‌ పడుతోంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి అపోలో ఆసుపత్రివైపు, బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12 నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్‌ కూడలి వద్ద ఎక్కువ సమయం ఇస్తుండడంతో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 మీదుగా వస్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఆగిపోతున్నారు.


ఐకియా నుంచి ఇనార్బిట్‌ మధ్య ఫ్లైఓవర్‌

షేక్‌పేట దాటితే:గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించేందుకు షేక్‌పేట మల్లం చెరువు నుంచి టోలీచౌకీ గెలాక్సీ థియేటర్‌ సమీపం వరకున్న షేక్‌పేట ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చాక కూడా ట్రాఫిక్‌ చిక్కులు తగ్గలేదు. షేక్‌పేట, విష్పర్‌వ్యాలీ, ఓయూ కాలనీ, ఫిలింనగర్‌ క్రాస్‌రోడ్ల వద్ద వాహనాలు ఆగకుండా ఉండేందుకు ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

*మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు ఇది సౌకర్యంగా ఉంటున్నా.. గచ్చిబౌలి, మాదాపూర్‌ నుంచి అత్తాపూర్‌, మెహిదీపట్నంవైపు వెళ్లే వాహనదారులు ఫ్లైఓవర్‌ దిగిన వెంటనే కింది వైపు నుంచి వస్తున్న బస్సులు, వాహనాలు, పైవంతెన మీదుగా కిందికి దిగిన వాహనాలకు అడ్డంకిగా మారుతున్నాయి. షేక్‌పేట, మెహిదీపట్నం మార్గంలో వాహనదారులు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇవీ చదవండి:వేడెక్కిన మునుగోడు.. పోరుకు అన్ని పార్టీలు సమాయత్తం

నాంపల్లి రైల్వే స్టేషన్‌కు ఘనమైన చరిత్ర.. స్వరాజ్య పోరాటానికి ప్రతిరూపం

ABOUT THE AUTHOR

...view details