హైదరాబాద్లో ఎడతెరపి లేని వర్షానికి ఎల్బీనగర్ నుంచి సాగర్రింగ్రోడ్డు వెళ్లే దారిలో భారీగా వర్షపు నీరు నిలిచింది. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసు అంజపల్లి నాగమల్లు ఆ నీటిని తొలగించేందుకు అక్కడే ఉన్నాడు. అదే మార్గంలో ఓ వ్యక్తి, అనారోగ్యంతో ఉన్న తండ్రిని స్కూటీ పై తీసుకెళుతుండగా నీటి మధ్యలో స్కూటీ చిక్కుకుంది. స్టాండ్ సాయంతో తప్ప నడవలేని అతడిని గమనించిన పోలీసు వెంటనే కింద పడకుండా తన వీపుపైన మోస్తూ నీళ్ల నుండి బయటికి తీసుకొచ్చాడు. ట్రాఫిక్ అవగాహనపై పాటలు పాడుతూ నాగమల్లు అందరికీ పరిచయమే.
మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీసు
హైదరాబాద్ ఎల్బీనగర్లో వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయింది. అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఓ వాహనదారుడు నీటిలో చిక్కుకుంటే అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు ఆ వ్యక్తిని తన భుజాలపై ఎక్కించుకుని మానవత్వం చాటుకున్నారు.
మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీసు