Traffic Challans Cases in Telangana 2023 : తెలంగాణలో జరిమానాలు జరిమానాలే, ఉల్లంఘనలు ఉల్లంఘనలే అన్నట్లుంది వాహనాలు నడిపేవారి పరిస్థితి. ఎన్ని కేసులు నమోదవుతున్నా, ఎంత జరిమానా విధిస్తున్నా, వీటికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటున ప్రతి గంటకు 1,731 చొప్పున ట్రాఫిక్ ఉల్లంఘనలు (Traffic Challans Cases in Telangana) నమోదవుతున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గతేడాది కోటికి పైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు :మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) ఉల్లంఘించే వారిని గుర్తించి, జరిమానా విధించడం సులభమైంది. దీంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత సంవత్సరం రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 1,51,63,986 కేసులు నమోదయ్యయి. వీటికి విధించిన జరిమానా రూ.519 కోట్లు. అంటే సగటున రోజుకు 41,544 ఉల్లంఘనలు నమోదవుతుండగా, రూ.1.42 కోట్ల వరకు జరిమానా విధిస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త రూల్స్.. గీతదాటితే రూ.100, అడ్డుపడితే రూ.1000 కట్టాల్సిందే..
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులు : జరిమానా విధించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఉల్లంఘనలకు పాల్పడే వారిలో అవగాహన, జవాబుదారీతనం కలిగించడం. వాహనదారులు జరిమానా చెల్లించేందుకైనా సిద్ధపడుతున్నారు కానీ, ట్రాఫిక్ నిబంధనలు మాత్రం పాటించడం లేదు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నరకం చూపిస్తోంది. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణలోని చిన్న పట్టణాల్లోనూ ట్రాఫిక్ ఇబ్బందులు అధికమవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు మౌలిక వసతుల కల్పనతో పాటు సరైన పర్యవేక్షణ కూడా అందుబాటులో ఉండాలి.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు పోలీసుల ప్రణాళిక