తెలంగాణ

telangana

ETV Bharat / state

'హీరో ప్రభాస్‌ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు' - challan to actor prabhas car

Prabhas car: ట్రాఫిక్‌ పోలీసులు ఎంత చెప్పినా పలువురు సెలబ్రిటీలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రముఖ నటుడు ప్రభాస్​ కారుకు కూడా హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు చలానా విధించారు. తనిఖీల్లో భాగంగా ఆయనకు కారుకు ఉన్న బ్లాక్​ ఫ్రేమ్​తో పాటు ఎంపీ స్టిక్కర్​ను తొలగించి రూ.1,450 జరిమానా విధించారు.

హీరో ప్రభాస్‌ కారుకు​ ట్రాఫిక్‌ పోలీసుల చలానా
హీరో ప్రభాస్‌ కారుకు​ ట్రాఫిక్‌ పోలీసుల చలానా

By

Published : Apr 16, 2022, 3:40 PM IST

Updated : Apr 16, 2022, 3:50 PM IST

Hero Prabhas: హీరో ప్రభాస్‌ కారుకు పోలీసులు చలానా విధించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో బ్లాక్ ఫ్రేమ్‌తో వెళ్తున్న వాహనాన్ని గుర్తించారు. దీనికితోడు నంబర్‌ప్లేట్‌ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్ ఉండటం గమనించారు. కారు ఎవరిదని విచారించగా హీరో ప్రభాస్‌ కారుగా తేలింది. ఎంపీ స్టిక్కర్​ను తొలగించిన పోలీసులు 1,450 రూపాయలు జరిమానా విధించారు. జరిమానా విధించిన సమయంలో ప్రభాస్‌ కారులో లేరు.

వాహనాలకు ఉన్న బ్లాక్‌ స్టిక్కర్లు, బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగించాలని గత కొన్నిరోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. అలా తొలగించని వారి వాహనాలకు ఫైన్స్‌ కూడా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య, త్రివిక్రమ్, కల్యాణ్‌రామ్‌, మంచు మనోజ్​ కార్లకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌నును పోలీసులు తొలగించి జరిమానా వేసిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

Last Updated : Apr 16, 2022, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details