తెలంగాణ

telangana

ETV Bharat / state

గోమాత లచ్చమ్మకు వైభవోపేతంగా సీమంతం

తితిదే హిందు ధర్మ ప్రచార పరిషత్, గోసంరక్షణ సమితి ఆధ్వర్యంలో గోమాత లచ్చమ్మకు విజయవాడలో ఘనంగా సీమంతం నిర్వహించారు. రైతు యారా ఆంజనేయ ప్రసాద్​ అల్లారు ముద్దుగా సాకుతున్న ఆవుకు సాంప్రదాయకంగా ఈ కార్యక్రమాన్ని చేశారు.

By

Published : Apr 14, 2021, 6:31 PM IST

గోమాత లచ్చమ్మకు వైభవోపేతంగా సీమంతం
గోమాత లచ్చమ్మకు వైభవోపేతంగా సీమంతం

ఆంధ్రప్రదేశ్​ విజయవాడలోని గుణదలలో గోమాతకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. గుణదలకు చెందిన రైతు యారా ఆంజనేయ ప్రసాద్... అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న లచ్చమ్మ అనే ఆవుకు శాస్త్రోక్తంగా సీమంతం జరిపించారు. కార్యక్రమానికి స్ధానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో..

అనంతరం భక్తి శ్రద్దలతో గోమాతకు పూజలు చేశారు. తితిదే హిందు ధర్మ ప్రచార పరిషత్ , గో సంరక్షణ సమితి సభ్యులు క్రాంతీ కుమార్, సీవీకే ప్రసాద్, శ్రీపల్లి సిద్దార్ధ, శ్రీనివాస్, గుళ్లపల్లి రంగారావు హాజరయ్యారు.

జీవన విధానానికే నిదర్శనం..

మనిషి దైనందిన జీవితంలో గోవులతో ముడిపడిన జీవన విధానానికి నిదర్శనంగానే గోమాతకు సీమంతం చేసినట్లు తితిదే హిందు ధర్మ ప్రచార పరిషత్, గోసంరక్షణ సమితి సభ్యులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:త్వరలోనే హైదరాబాద్​లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details