తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి ఇలాఖాలో..దసరా మామూళ్లు ఇవ్వాలంటూ డప్పు చాటింపు - ర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నియోజకవర్గం వార్తలు

ఊర్లోకి రేషన్ బియ్యం వస్తే, దరఖాస్తులు చేయడానికి, లంచం అడిగితే మాకు ఫిర్యాదు చేయండి అని దండోరాలు వింటుంటాం! కానీ మంత్రి ఇలాఖాలో దసరా మామూళ్లు ఇవ్వాలంటూ డీలర్లు చాటింపు వేయించారు. ఇంతకీ ఈ చాటింపు ఏ నియోజకవర్గంలో అనుకుంటున్నారా..!

మంత్రి ఇలాఖాలో..దసరా మామూళ్లు ఇవ్వాలంటూ డప్పు చాటింపు
మంత్రి ఇలాఖాలో..దసరా మామూళ్లు ఇవ్వాలంటూ డప్పు చాటింపు

By

Published : Oct 4, 2020, 2:16 PM IST

ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నియోజకవర్గంలోనే రేషన్‌ దుకాణాదారులు దసరా మామూళ్లు ఇవ్వాలంటూ చాటింపు వేయించడం అందర్నీ విస్తుగొల్పుతోంది. దసరా సందర్భంగా కార్డుదారులందరూ రేషన్‌ బియ్యానికి వచ్చేటప్పుడు రూ.20 చొప్పున దసరా మామూళ్లు ఇవ్వాలంటూ చాటింపు వేయడం రెవెన్యూ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం దీనికి కేంద్రబిందువుగా మారింది. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగటంతో మరింత చర్చనీయాంశమైంది. కార్డుదారులందరూ రూ. 20 వంతున దసరా మామూళ్లు తెచ్చి ఇవ్వాలంటూ చాటింపు వేయాల్సిందిగా గ్రామంలోని ముగ్గురు డీలర్లు కలిసి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై టాంటాం వేసే ప్రభాకరరావుతో చెప్పారు. వారి ఆదేశాలపై అతడు శనివారం ఉదయం గ్రామంలోని ప్రతి వీధిలో తిరిగి ఆ మేరకు చాటింపు వేశాడు. అది విన్న గ్రామస్థులు, కార్డుదారులు విస్తుపోతున్నారు. బహిరంగంగా దసరా మామూళ్లు తీసుకురావాలనడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ప్రభాకరరావును అడిగితే... డీలర్లు చెప్పడం వల్లనే చాటింపు వేశానని చెప్పారు. దీనిపై తహసీల్దార్‌ ఆంజనేయులుని అడగగా... చాటింపు వేయించినట్లు తమ పరిశీలనలో తేలిందని.. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి.వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ వేగవంతం

ABOUT THE AUTHOR

...view details