ప్రపంచమంతా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న క్రమంలో ఈ వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రచయిత్రి సగలి సుధారాణి పాట రచించారు. 1955లో వచ్చిన తెలుగు చలన చిత్రం "రోజులు మారాయ్''లో 'ఏరువాక సాగారో రన్నో సిన్నన్న' అంటూ పాడిన జానపద పాటను తిరిగి మరొసారి రచయిత్రి గుర్తు చేశారు. కరోనా వైరస్‌పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందు కోసం జానపద రూపంలో ఈ పాటను డాక్టర్ సగిలి సుధారాణి రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన హేమమాలిని ఈ పాటను ఆలపించారు.
కరోనాపై పాట.. వీధులెంట తిరగకురోరన్నో... - హేమమాలిని
కరోనమ్మోరు ఊరూవాడ... లోకమంతా కబలిస్తుంటే... వీధి ఎంబటి తిరగకురోరన్నో సిన్నన్న.. నీ గూడులోనే భద్రమురో రన్నో సిన్నన్న అంటూ కరోనాపై పాట పాడారు హేమామాలిని. కొవిడ్-19 నియంత్రణ కోసం జానపద రూపంలో పాట పాడి అవగాహన కల్పించారు.
కరోనాపై ఆవగాహన కోసం జనపద పాట