ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని స్తిరాస్థి వ్యాపారులు... హయత్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వీరికి భాజపా, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పాల్గొన్నారు. అనంతరం విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు.
ఎల్ఆర్ఎస్ను నిరసిస్తూ స్థిరాస్తి వ్యాపారుల ఆందోళన - స్థిరాస్తి వ్యాపారుల ఆందోళన
ఎల్ఆర్ఎస్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... స్థిరాస్తి వ్యాపారులు, భాజపా, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎల్ఆర్ఎస్ను నిరసిస్తూ స్థిరాస్తి వ్యాపారుల ఆందోళన
భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో... ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి... హయత్నగర్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప వివాదం ఏర్పడింది.
ఇదీ చూడండి:సందిగ్ధంలో సర్కారు: ఎల్ఆర్ఎస్పై ఏం చేద్దాం.. ఎలా ముందుకెళదాం?